కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెర్కపల్లి లో విద్యుత్ అధికారులు పొలం బాట కార్యక్రమం నిర్వహించినట్లు గురువారం టెక్నికల్ డి ఈ ఉపేందర్ తెలిపారు. రైతులకు న్యాయమైన విద్యుత్ అందించడం కోసం తాము అన్నివేళలా పనిచేస్తున్నామని, లో వోల్టేజ్ సమస్యలు, లూజ్ వైర్లు లేకుండా మెరుగైన సేవలు అందించడానికి పోలంబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో రైతులకు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.