జిల్లా ఎస్పీ శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు యువతకు భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తిస్తూ, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా "డ్రగ్స్ వద్దు బ్రో" అనే నినాదంతో, నగరంలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కడప పోలీసుల కళా జాగృతి బృందం, నార్కోటిక్ సెల్, మరియు 'ఈగల్' సిబ్బంది తమ కళా రూపాల ద్వారా, వాస్తవ పరిస్థితులను వివరించడం ద్వారా విద్యార్థులకు డ్రగ్స్ వలన కలిగే అనర్థాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.