బాపట్ల సూర్యలంక బీచ్ లో సముద్రపు అలల తాకిడికి కొట్టుకుపోతున్న ఒక యువకుడి నిండు ప్రాణాలను మెరైన్ పోలీసులు ఆదివారం సాయంత్రం కాపాడారు.వినాయక నిమజ్జనానికి సమీప గ్రామం నుండి వచ్చిన కొందరు యువకులు సముద్రంలో స్నానం చేస్తుండగా వారిలో ఒకరు అలలు తాకిడికి కొట్టుకుపోసాగాడు.అక్కడే ఉండి పరిస్థితి గమనిస్తున్న మెరైన్ పోలీసులు వెంటనే సముద్రంలోకి వెళ్లి అతడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు.ఎవరూ సముద్రంలో లోతుకు వెళ్లరాదని సూచించారు.