అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని జక్కలచెరువు గ్రామంలో యువకలు ఏర్పాటుచేసిన వినాయకుడికి నైవేద్యంగా ఉంచిన లడ్డు వేలంపాట వేయగా రికార్డు ధర పలికింది. శుక్రవారం గ్రామంలోని వినాయక మండపం ఎదురుగా వేలంపాట నిర్వహించగా పోటాపోటీగా పాట పాడారు. వారిలో గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ సూర్య ప్రతాప్ రూ.69వేలకు లడ్డు వేలం పాట దక్కించుకున్నాడు. పాటలో లడ్డు పొందిన ప్రతాప్ కు యువకులు సన్మానించారు. గుత్తి మండలంలో ఇదే అత్యధిక ధర పలికిన వేలం పాట అని స్థానికులు తెలిపారు.