సదాశివనగర్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు స్త్రీ సంబంధిత ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డా.ఆస్మా తెలిపారు. గైనకాలజిస్ట్ డా.అమర్జ స్త్రీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తీవ్ర ఆరోగ్య సమస్యలున్న మహిళల రక్త నమూనాలు సేకరించారు.ప్రతి ఒక మహిళ ప్రభుత్వం నిర్వహించే వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తెలిపారు.