పలమనేరు:పట్టణంలోని విజయలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మాజీమంత్రి ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్, మాజీ ఎంపీ రెడ్డప్ప, ప్రస్తుత ఎంపీ గురుమూర్తి ఘన స్వాగతం తెలిపారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసి దీవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు,పలమనేరు వైసీపీ కన్వీనర్ హేమంత్ కుమార్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద, మున్సిపల్ చైర్ పర్సన్ కౌన్సిలర్ పవిత్ర మురళీకృష్ణ, తదితర వైఎస్ఆర్సిపి పార్టీ ప్రముఖ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.