ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు కుడి కాలువకు గండి పడి నీరు వృధాగా పోతుందని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్ అన్నారు. శనివారం మధ్యాహ్నం CPM జిల్లా నాయకులతో కలిసి ఆసిఫాబాద్ మండలంలోని సల్పలాగూడ గ్రామ సమీపంలో గండి పడ్డ కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాలువను నమ్ముకొని వరి పంట వేసిన రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. ఇరెగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే కాలువకు గండి పడిందని ఆరోపించారు.