శ్రీ సత్య సాయి జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ సినిమా విడుదలను పురస్కరించుకుని హిందూపురం జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. సుగురు ఆంజనేయస్వామి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని, ఓజి సినిమా హిట్ కావాలని ఆకాంక్షిస్తూ 101 టెంకాయలు కొట్టి సుమారు 100 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం, పట్టణంలోని అమృత్ మహల్ థియేటర్ వద్ద కార్యకర్తలు హంగామా సృష్టించారు. రాత్రి 10 గంటలకు ప్రత్యేకంగా ‘OG’ ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు. ఈ షో కోసం జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.