రైతు సంక్షేమం కోసం జలయజ్ఞం, ఉచిత విద్యుత్, రుణమాఫీ లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక వ్యక్తి దివంగత నేత వైఎస్సార్ అని కర్నూలు జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కొలిమిగుండ్ల వైయస్సార్ కార్యాలయంలో దివంగత నేత వైయస్సార్, పెద్దాయన ఎర్రబోతుల వెంకటరెడ్డి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాటసాని ప్రసాద్ రెడ్డి, నందకిషోర్ రెడ్డి, మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు