వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా రామచంద్రపురం, కె.గంగవరం మండలాలకు సంబంధించి ద్రాక్షారామం లో కిసాన్ డ్రోన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 7 డ్రోన్లను 7 రైతు గ్రూపులకు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఆధునిక యాంత్రీకరణ అయిన డ్రోన్లు వినియోగం రైతుకు అన్ని విధాల శ్రేయస్కరమని పెట్టుబడిని గణనీయంగా తగ్గించేందుకు ఈ సాంకేతికత ఉపయోగ పడుతుందన్నారు