గుంటూరు జిల్లా పెదకాకానిలో గురువారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సిఐటియు జిల్లా కార్యదర్శి వై. నేతాజీ మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాల వల్ల అంగన్వాడీ కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారని, చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ కష్టమవుతోందని తెలిపారు. అనంతరం తహసిల్దార్ కు వినతి పత్రం అందించారు.