చంద్ర గ్రహణం కారణంగా భద్రాచలం రామాలయం తలుపులను ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు మూసివేశారు. గ్రహణానికి ముందే స్వామి వారికి నిర్వహించాల్సిన అన్ని సేవలను పూర్తి చేశారు. సోమవారం తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి, సంప్రోక్షణ అనంతరం సుప్రభాతం, ఆరాధన, నివేదన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 7.30 నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుందని ఆలయ కార్యనిర్వాహణ అధికారి దామోదర్ తెలిపారు...