గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు భీమవరం కలెక్టరేట్ వద్ద సోమవారం మధ్యాహ్నం 2:30కు ఆందోళన నిర్వహించారు. ఏలూరు జిల్లాలో కలిపితే తీవ్ర ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఏలూరు దూరం కారణంగా ప్రజలకు సమయం, డబ్బు వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గణపవరం పోలీస్‌స్టేషన్‌ను భీమవరానికి మార్చాలని కోరారు. కలెక్టరేట్ లోనికి వెళ్లే ప్రయత్నం చేసిన గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అఖిలపక్ష నాయకులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.