కామారెడ్డిలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం స్థానంలో కొత్తది నిర్మించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు. తమ తల్లిదండ్రులతో కలిసి నిరసన తెలిపారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పెచ్చులూడిన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో.. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి గదిలోని పైకప్పు పెచ్చులు సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఊడిపడ్డాయి. తాము ఏమైనా మేస్త్రీ పనిచేసే వాళ్లమా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ తమ పాఠశాలకు మరోసారి వచ్చి పరిస్థితిని కళ్లారా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.