ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: కాంగ్రెస్..ఉల్లి రైతులను ప్రభుత్వం కనీసం మద్దతు ధర కల్పించి, ఆదుకోవాలని ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఖాసీంవలి డిమాండ్ చేశారు. సోమవారం గోనెగండ్ల గ్రామ సమీపంలో ఉల్లి రైతులను పరామర్శించారు. అనంతరం ఖాసింవలి, యువజన నాయకులు వీరేష్ యాదవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఉల్లి రైతులకు ఆదుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.