వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణ కోసం పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు చెరుకువాడ గ్రామంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ చెత్త తొలగింపు, దోమల నిర్మూలన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారు. విద్యార్థులకు చేతులు శుభ్రం చేసుకోవడం, జంక్ ఫుడ్ మానుకోవడం, పరిశుభ్రత పాటించడం పై అవగాహన కల్పించారు. అపరిశుభ్రత వల్ల మలేరియా, డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు.