నగరంలోని సిర్నాపల్లి గడి వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మండపం నిర్మాణం కోసం సంతోష్ శర్మ నేతృత్వంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవి నవరాత్రుల సార్వజనిక సమితి అధ్యక్షులు అంబెం సాయిలు, గౌరవ అధ్యక్షులు హరిదాసు మాట్లాడుతూ ప్రతి ఏడాది దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. దానిలో భాగంగా మండపం నిర్మాణం కోసం భూమి పూజ చేశామన్నారు. నిత్యం పూజా కార్యక్రమంలో దేవి శరన్నవరాత్రిలో భాగంగా తొమ్మిది రోజులు జరుపుకునే నవరాత్రుల వేడుకలు నియమనిష్ఠలతో నిర్వహిస్తామన్నారు.