కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన తొమ్మిదవ వార్షికోత్సం సందర్భంగా జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకునికి మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పూజారి నుంచి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయకుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని అలాగే వినాయక నిమజ్జనం శాంతియుతంగా చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.