ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్రతీరంలో బుధవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజలు భారీగా కనిపించారు. విగ్రహాలను సాయంత్రం 6 గంటల వరకు సముద్రంలో నిమజ్జనం చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత భారీ మొత్తంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగలేదని స్థానిక ప్రజలు తెలిపారు. సముద్రం లోపలికి మరింత లోతుగా వెళ్లకుండా మెరైన్ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.