హిందూపురం పట్టణంలో 4న జరిగే గణేష్ నిమజ్జనం శోభయాత్ర, 5న జరిగే మిలాద్- ఉన్ నబి పండుగలను అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ వి.రత్న ఐపిఎస్ ముస్లిం మత పెద్దలతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు. పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై ముస్లిం మత పెద్దలతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి తగిన బందోబస్తు సిద్ధం చేశామన్నారు. నిమజ్జనం సందర్భంగా శోభయాత్ర వెళ్లే ప్రధాన రూట్లను పరిశీలించారు. స్కూటర్ ర్యాలీని ప్రారంభించి ఏపీఎస్పీ ప్లటూన్ బలగాలతో జిల్లా ఎస్పీ గారు పోలీస్ కవాతు నిర్వహించారు. అనంతరం నిమజ్జనం చేసే ప్రాంతాలను పరిశీలించారు.