హనుమకొండ: హనుమకొండ జిల్లాకు సంబంధించి గ్రామ పంచాయతీ పాలన అధికారులు( జిపిఓలు) నియామక పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకునేందుకు శుక్రవారం హైదరాబాద్ కు తరలి వెళ్లారు. హైదరాబాద్ లో నియామక పత్రాలను స్వీకరించేందుకు హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం నుండి జిపిఓల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హనుమకొండ జిల్లాకు సంబంధించి 110 మంది జిపిఓ లు మూడు బస్సుల్లో హైదరాబాద్ కు బయలుదేరారు.