పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులో శనివారం లారీ, బస్సు ఢీకొన్నాయి. భీమవరం నుంచి ఏలూరు వెళ్లే ఎక్స్ప్రెస్ను మలుపులో భీమవరం వైపు వెళ్లే లారీ ఢీకొంది. సరిగ్గా ఎస్ మలుపులో ఈ సంఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంఘటనా స్థలానికి ఆకివీడు పోలీసులు చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.