జిన్నారం మున్సిపాలిటీలోని పెద్దమ్మ గూడెం గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో డప్పు చప్పుల నడుమ మహిళలు యువతులు బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా పెద్దమ్మ గుడికి తరలి వెళ్లారు. అమ్మవారికి బోనం సమర్పించి మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.