నల్గొండ జిల్లా, నేరేడు గుమ్ము మండలంలోని పెద్దమునిగల్, చిన్నమునిగల్, బచ్చాపురం, పలుగుతండా, నల్లబావి గ్రామాలలో ఎంఎల్ హెచ్ పి అరుణ శనివారం సాయంత్రం సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిలిచిపోయి దోమలు పెరుగుతున్నాయని తెలిపారు. జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రజల పరిశుభ్రతను పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.