Download Now Banner

This browser does not support the video element.

ధన్వాడ: పత్తి దిగుమతి పన్ను రద్దు రైతులకు అన్యాయం:అఖిల భారత ఐక్య రైతు సంఘం

Dhanwada, Narayanpet | Sep 6, 2025
నారాయణపేట, సెప్టెంబర్ 6: కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై విధించిన 11% పన్నును రద్దు చేయడాన్ని నిరసిస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్), తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో కోటకొండ గ్రామంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. రాము మాట్లాడుతూ, దేశీయ రైతులు పెట్టుబడులు పెట్టి, గిట్టుబాటు ధరలు లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ఈ నేపథ్యంలో పత్తి దిగుమతులపై పన్ను రద్దు చేయడం పెట్టుబడిదారి దేశాలకు అనుకూలమని, ఇది దేశ రైతులకు తీరని అన్యాయమని ఆరోపించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us