రైతులకు యూరియా బస్తాలు అందజేయాలని సిపిఎం ధర్నా పరకాల: రైతులకు పంటకు సరిపడా యూరియా బస్తాలను సకాలంలో అందించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో పరకాల లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడారు. పరకాల పట్టణంలో ఉన్న ఫర్టిలైజర్ షాపులు యూరియా బస్తాలను నిలువ ఉంచుకొని రైతులకు అందించడం లేదని, ఇతర మందులు కొంటేనే యూరియా బస్తాలు అమ్ముతామని చెప్పడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని, వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ కరువైందని, షాపుల యజమానులు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా బస్తాలు ఇవ్వకుంటే చర్యలు చేపడ