కళ్యాణదుర్గం శివారు లోని సుబేదార్ చెరువుతోపాటు మరో చెరువులో శనివారం అధికారులు దోమల నివారణ కోసం గంబూషియా చేపలను వదిలారు. మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్, ప్రోగ్రాం ఆఫీసర్ రాజేష్ కుమార్, మలేరియా ఆఫీసర్ తిరుపాలయ్య ఆధ్వర్యంలో ఒక్కొక్క చెరువులో నాలుగు వేలు చొప్పున 8 వేలు గంబూషియా చేపలను వదిలారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. దోమల లార్వాలను గంబూషియా చేపలు పూర్తిగా తినేస్తాయన్నారు. తద్వారా దోమల ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు. దోమల బెడద లేకుండా అవుతుందన్నారు.