అందోల్ నియోజక వర్గం లోని రాయికోడ్ మండలంలోనీ హస్నాబాద్ గ్రామం ను ఆదివారం మంత్రి దామోదర రాజనర్సింహ సందర్శించారు.సింగూర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అనుకోని ఉన్న గ్రామాలను అనుసంధానం చేస్తూ హాస్నాబాద్ నుండి ఇందూరు, కర్చల్ గ్రామాల మీదుగా 6 కోట్ల రూపాయలతో 4.5 కిలోమీటర్ల మేరా నిర్మిస్తున్న రోడ్డు , బ్రిడ్జి పనులను పరిశీలించారు . వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలతో ముఖాముఖీ గా మాట్లాడారు . పేరుపేరునా యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాల అమలును తెలుసుకున్నారు .