ప్రకాశం జిల్లా ఒంగోలు సహకార బ్యాంకులో సెక్షన్ 51 విచారణ బుధవారం ప్రారంభమైంది. విచారణ అధికారిగా నియమితులైన రాష్ట్ర సహకార శాఖ అధర్ రిజిస్టర్ గౌరీశంకర్ కార్యాలయానికి వచ్చి కార్యాలయంలోని కంప్యూటర్లను పరిశీలన చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులతో చర్చించిన అనంతరం కార్యాలయానికి సంబంధించిన హార్దిస్కులను స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. సెక్షన్ 51 విచారణను మొదటి నుంచి సహకార శాఖ అధికారులు వ్యతిరేకిస్తున్నప్పటికీ బ్యాంకులో గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతి అక్రమాలు అవకతవకలను వెలుగులోకి తీసుకురావడానికి సెక్షన్ 51 విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.