వ్యవసాయం పండగ అని చెప్పిన వ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డి... వ్యవసాయం దండగ అని చెప్పిన దండగమాలిన మనిషి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటూ వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శలు చేశారు .కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎరువుల కోసం క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. మహిళా రైతులు ఎరువుల కోసం జుట్టు పట్టుకొని కొట్టుకోవాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చిందని రాచమల్లు తెలిపారు. రైతులకు మద్దతుగా సెప్టెంబర్ 9వ తేదీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టినట్లు రాచమల్లు తెలిపారు.