వినాయక నవరాత్రుల అనంతరం శోభయాత్ర నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు శనివారం రాత్రి జైపూర్ మండలంలోని ఇందారం సమీపంలో గల గోదావరి వంతెన వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని డిసిపి భాస్కర్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితిని పురస్కరించుకొని భక్తి శ్రద్దలతో పూజించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.