ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 5 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో గ్రామానికి చెందిన ఎంపీటీసీ వెంకటేశ్వర్లకు పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారందరిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిచ్చికుక్క స్వైర విహారంతో భయాందోళనలు చెందిన గ్రామస్తులు పిచ్చికుక్కను చంపేశారు. సోమవారం ఏకంగా ముగ్గురిపై దాడి చేసి గాయపరిచినట్లు ఎంపీటీసీ వెంకటేశ్వర్లు తెలిపారు. వీధి కుక్కల భారి నుంచి ప్రజలను రక్షించాలని అధికారులు కోరుతున్నారు.