కనిగిరి మున్సిపల్ పరిధిలో వీధి కుక్కలను పట్టుకునేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం కమీషనర్ తన కార్యాలయంలో మాట్లాడుతూ... కుక్క కాటుకు గురైన బాధితులు ఫిర్యాదు చేయడంతో గురువారం కుక్కలను పట్టు వారిని పిలిపించుచున్నామని తెలిపారు. శానిటరీ సెక్రెటరీలు అందరూ తమ సచివాలయ పరిధిలోని కుక్కలను పట్టు వారికి సహకరించి వీధులలో ఉన్న అన్ని కుక్కలను పట్టించాలని కోరారు. ప్రజలు కూడా వీధి కుక్కలు ఉంటే సంబంధిత సచివాలయ శానిటరీ సెక్రటరీ వారికి తెలియ చేయాలని కోరారు.