కళ్యాణదుర్గం నియోజకవర్గం లో నలుగురు యువకులు మెగా డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన దాదా పీర, కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన హరీష్, సెట్టూరు మండలం ముచ్చర్ల పల్లికి చెందిన నిఖిల్ బాబు, బుడ్డయ్య దొడ్డి గ్రామానికి చెందిన ఈరన్న డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించినట్లు ఉపాధ్యాయులుగా ఎంపికైన యువకులు వెల్లడించారు.