నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం కొత్తరాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం, మహబూబ్ నగర్ కు చెందిన శ్రావణిని ప్రేమించి 2014లో వివాహం చేసుకున్నాడు. మనస్పర్థల కారణంగా శ్రావణి ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది. ఈ నెల 21న శ్రీశైలం, శ్రావణిని సోమశిలకు వెళ్లామని చెప్పి పెద్దకొత్తపల్లిలోని సాతాపూర్ మారేడుమాన్ అడవి ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి, మృతదేహాన్ని కాల్చివేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.