కనిగిరి పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతులకు యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన సిపిఐ పార్టీ ప్రకాశం జిల్లా కార్యవర్గ సభ్యులు వై రవీంద్రబాబు మాట్లాడుతూ... రైతులకు సరిపడినంత యూరియాను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు ఎక్కడా కొరత లేకుండా ప్రభుత్వం ఏరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే సిపిఐ పార్టీ తరఫున ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కనిగిరి తహసిల్దార్ రవిశంకర్ కు అందజేశారు.