వెలిగండ్ల ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఎంపీడీవో మహబూబ్ బాషా బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిన దృష్ట్యా రైతులకు అధికారులు ఈ విషయాలను తెలియజేయాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడా కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఎంపీడీవో సూచించారు. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం అయ్యేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.