నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన మహిళ గురువారం సాయంత్రం మృతి చెందింది. రాత్రి మృతి ర్యాలీ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన చెవులపాటి జానకమ్మ (65) గత మూడు రోజుల క్రితం గుండెనొప్పితో జ్యోతి ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందగా, మృతురాలి కుమారుడు రమేష్ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తాము వైద్యం సక్రమంగానే చేసామని గుండెపోటుతో మృతి చెందిందని డాక్టర్ మువ్వా రామారావు తెలిపారు.