మైలార్దేవ్పల్లి టాటానగర్ లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు, కమ్ముకొన్న దట్టమైన పొగతో స్థానికులు ఆందోళన గురయ్యారు. ఇది పాత ప్లాస్టిక్ సామాన్ల గోదామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అదృష్టవశాత్తూ ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.