ఆ ఊరిలో అంత్యక్రియలు చేయాలంటే ఏరు దాటాల్సిందే. చాగలమర్రి(M) తోడేండ్లపల్లెలో ఎవరైనా మరణిస్తే శ్మశానానికి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వంకలో శవపేటికను మోస్తూ దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వర్షాకాలంలో ఇది మరింత హానికరంగా మారుతుంది. ముఖ్యంగా స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా దళితవాడ ప్రజల బాధలు వర్ణనాతీతం. మౌలిక సదుపాయాలకు నోచుకోలేదు. వంకపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు.