యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో పోలీసుల పహారాలో రైతులకు రెండు బస్తాల యూరియా వ్యవసాయ శాఖ అధికారులు ఇస్తున్నారు. గురువారం ఉదయం రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. యూరియా కొరత ఏర్పడడంతో రైతులు ఉదయం నుండి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కేంద్రం వద్ద బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల పహారాలో రైతులకు రెండు బస్తాల యూరియాను వ్యవసాయ శాఖ అధికారులు అందిస్తున్నారు.