అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉరవకొండలో 90.2, వజ్రకరూర్ 79.0, విడపనకల్ 77.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ గురువారం ఉదయం 11 గంటల సమయంలో పేర్కొన్నారు. భారీ వర్షానికి బూదగవి చెరువు నుండి మరువ పారుతుంది. విడపనకల్ మండలంలో ఉండబండ, పాల్తూరు గ్రామాల మధ్య, వజ్రకరూరు మండలంలో పొట్టిపాడు చాయాపురం గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.