తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజున మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం మధ్యాహ్నం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వరదల వల్ల ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చడమే లక్ష్యమని, ఈ సమయంలో అసెంబ్లీలో కాకుండా ప్రజల మధ్య ఉండడమే ముఖ్యమని పేర్కొన్నారు. ఈరోజుతో సభకు హాజరు కావడం ముగిసిందని, రేపటినుండి తాను శాసనసభ సమావేశాలకు రానని స్పష్టం చేశారు.