ఇందిరమ్మ ఇళ్ల ఫోటోలు అప్లోడ్ చేయడం కోసం పంచాయతీ సెక్రెటరీ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా కర్ణమామిడి గ్రామానికి చెందిన డొల్క నాగమణి అనే లబ్ధిదారులకు కొండాపూర్ లో ఇందిరమ్మ ఇల్లు మంజూరయింది. ఇంటి నిర్మాణం చేస్తుండగా నిర్మాణ పనుల ఫోటోలను అప్లోడ్ చేయడం కోసం పంచాయతీ సెక్రెటరీ వెంకటస్వామి 20వేల రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు బాధితురాలి నుండి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.