ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చించోలి హనుమాన్ మందిర్ దగ్గర మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం, ఎక్స్ రోడ్డు నుంచి బోథ్ వెళ్తున్న లారీ.. బోథ్ నుంచి వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.