అనకాపల్లి జిల్లా వి.మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల దేవరాపల్లి తహశీల్దార్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఎఫ్.ఆర్.ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను నినాదాల రూపంలో వ్యక్తపరిచారు. అనంతరం ఎమ్మార్వో పీ.లక్ష్మీదేవికి వినతిపత్రం అందజేశారు. వీరికి సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు.