కామారెడ్డి జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు.. మర్కల్లో జులై 19న పలు ఇళ్లలో జరిగిన చోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఈరోజు కల్వరాల్ వద్ద ముఠా సభ్యుల్లో ఒకరిని పట్టుకున్నామన్నారు. చోరికి పాల్పడిన 9 మంది ముఠా సభ్యుల్లో సికిందర్ ఒకడు అని విచారణలో తేలింది. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు.