జిల్లా అభివృద్ధి చెందిందంటే దాని యొక్క మూలాలు విద్యావ్యవస్థలోనే ఉన్నాయని, ఆ వ్యవస్థను నడిపించేది ఉపాధ్యాయులే అని జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టిటిసి భవనం లో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ.. మనకు ఆది ఎవరైతే ఉన్నారో ఆయన సప్త ఋషులకు విద్య బోధించారు అప్పటి నుండి గురువుకు ఉన్నతమైన స్థానం ఉంది. పిల్లలకు ఉపాధ్యాయులు నూతన విద్యా సూచనలు పాటిస్తూ కొత్త కొత్త విషయాలు బోధించాలని పిల్లలకు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళమని తెలిపారు. నేను కూడా టీచర్ వృత్తిని చే