రైతులకు యూరియా సరఫరా చేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మండిపడ్డారు. శనివారం రాయదుర్గంలో ఆయన మాట్లాడుతూ కణేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లో హెచ్ఎల్సీ ఆయకట్టు కింద వేలాది ఎకరాల్లో వరిసాగు చేశారన్నారు. యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఇప్పటివరకూ సరఫరా అయిన యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోయిందని ఆరోపించారు. టిడిపి నాయకుల కనుసన్నల్లోనే యూరియా ఇస్తున్నారని ఆరోపించారు.