చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో బిజెపి రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు అయుబ్ అలీ ఖాన్ ఆయన కార్యాలయంలో సోమారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి భరోసా ప్రతి వ్యక్తికి రక్షణ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి 25 లక్షలరూపాయల ఉచిత వైద్యం అందిస్తూ బీమా సౌకర్యం కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు కల్పిస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదిని అన్నారు.